ఈ రోజు సజీవునిగా నీలో

ప: ఈ రోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే

రక్షణానంద బరితుడనై

కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా

నిత్యము నీ సన్నిధిలో  (2)

1.ఆకర్షించెను నీ ప్రేమ నన్ను

సుందరుడా మనోహరుడా  (2)

యేసయ్యా నీ ప్రేమలోనే

మనస్సుకు నెమ్మది ఆదరణ దొరికే (2)

ఆ హల్లెలూయా…. ఆ హల్లెలూయా (2)

2.మరుగై వున్న పరలోక సంగతులు

పామరుడను నాకు తెలియజేసితివి (2)

ఆత్మదీపం వెలిగించి నాలో

నీతో నడచుటకు కృప చూపితివే (2)

ఆ హల్లెలూయా…. ఆ హల్లెలూయా (2)

3.నూతన యెరూషలెం నా నివాసమని

నూతన సృష్ఠి గా నన్ను మార్చినావు (2)

నూతన వధువుగా సిద్దవడచు

ఎదురుచూస్తుా  జీవింతునయ్యా

 

ఆ హల్లెలూయా…. ఆ హల్లెలూయా (2)