ఈ పరిణయ శుభవేళ

ఈ పరిణయ శుభవేళ స్వాగతం

నవ వరుడ (వధువా) స్వాగతం

సంధించను నీ సతిన్‌ (పతిన్‌) – అందుకొనుమా స్వాగతం

 

1. దివ్యమైన స్నేహ బంధం అలరించగా

నవ్యమైన ప్రేమ గీతం పలికించగా

మరువక తండ్రి మాట మదినుంచగా

వరుడగు క్రీస్తు బాట పయనించగా

మరుమల్లెలు పలికాయి స్వాగతం

కలగాలని దీవెనలు స్వాగతం

 

2. కాలు మోపు ఇంిలోన మణిదీపమై

మేలు చేసి తృప్తినొందు గుణశీలియైు

భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియైు

కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియైు

విరజాజులు పలికాయి స్వాగతం

 

వెలగాలని ఈ ధరలో స్వాగతం