ఈ నేల నెత్తటితో తడిచేనా

ఈ నేల నెత్తటితో తడిచేనా – ఆ తల్లి హృదాయం వగచేనా

రాజైన యేసయ్యా – నీ కెంత బాధయ్యా

నా పాప శాపం సిలువై నిను వేదించేనా

1.త్యజియించినావు ఆ  సౌఖ్యం – దిగివచ్చినావు నా కోసం

నాకిచ్చినావు నీ సర్వం – వర్ణించలేను నీ త్యాగం

నా శిక్షయేగా నీ సిల్వమరణం – విడిపించినావయ్యా

2.ఏ దోషం లేనిది నీ కాయం – అయినా ఎందుకు ఆ గాయం

నీవు నిలిచింది నా స్థానం – నాకై విడిచావు నీ ప్రాణం

వెలలేనిదయ్యా నీ శుద్దరుధిరం – నను కడిగినావయ్యా

3.భరియించినావు నా శాపం – క్షమియించినావు నా పాపం

సహియించినావు ఆ ఘోరం – తొలగించినావు నా భారం

 

విలువైనదాయ్యా కల్వరి యాగం – నే మరువలేనయ్యా