ఈ దినం శుభ దినం

ఈ దినం శుభ దినం – ఈ లోకానికే పర్వ దినం ప్రకృతి -పరవశించెను ప్రతి హృదయము పులకించెను శుభం శుభం నీకు శుభం ఈ లోకానికే శుభ దినం     

ఈదినం”        

1.రాజుల రాజుగా – ప్రభు యేసు జన్మించెను  తన ప్రజల వారి పాపము నుండి విడిపించి రక్షింపను                 “శుభం”        

2.మహిమ స్వరూపుడు క్రీస్తుగా జన్మించెను నిత్య జీవమును శాశ్వత ప్రేమను సమాధానమిచ్చుటకు   “శుభం”     

 

3.శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను దీనులను ధన్యులుని  చేసి ఆశీర్వాదించుటకు   “శుభం