ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను – నా చేయి పట్టుకో నా యేసు నాధా

గాలి తుఫానులకు కలిగే తరంగముల కొట్టబడుచున్నాను గానా …దేవా

1.సారహీనపు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబు రావా

సార కరుణా రసధారల్ నొసగుము సాగిపోవను ముందుకు శక్తిని నాకిమ్ము ||ఈ జీవిత ||

2.బయట పోరాటములు భయపెట్టుచుండెను భార్యా పుత్రాదులచే బాధలేన్నో కలిగే బాధలన్నియు బాయ బహు త్వరగా రావా ||ఈ జీవిత ||

3.రాజ్యంబు పై రాజ్యంబు రంకె వేయుచుండే – రాష్ట్రము పై రాష్ట్రంబు రగులుచుండె – రాజులకు రాజువై రయముగ రావయ్యా

రాజ్యమేలను త్వరలో రమ్ము రమ్ము||ఈ జీవిత ||

4.సైతాను చెలరేగే సమయంబిక లేదని సింహంబు రీతి గర్జించుచుండె

సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధాన రాజ్యం స్థాపింప రావా ||||

5.మొదటి జామయ్యెను మీరింక రారయ్యే – రెండవ జామున జాడలేదే

మూడవ జామయ్యే మీరింక రాలేదే – నాల్గవ జామున నడిచి వస్తున్నావా ||||

6.పెండ్లి కుమారుడు ప్రభువైన క్రీస్తుండు పెండ్లి సంఘం ఆత్మయు పిలచుచుండెను

 

పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని పాడెదను ||ఈ జీవిత ||