ఈ జీవితం విలువైనది నరులారా

ఈ జీవితం విలువైనది

నరులారా రండని సెలవైనది   ” 2 “

సిద్ధపడినావా చివరి యాత్రకు ” 2 “

యుగయుగాలు దేవునితో ఉండుటకు నీఉండుటకు        ”  నీ జీవితం  “

 

సంపాదన కోసమే పుట్టలేదు నీవు

పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు  ” 2 “

పోతున్నవారిని నీవు చూచుటలేదా   ” 2 “

బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ” 2 ”         

                             ”  నీ జీవితం  ”

 

మరణము రుచి చూడక బ్రతికే నరుడేవడు

కలకాలము ఈ లోకములో

ఉండే స్థిరుడేవడు                      ” 2 “

చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ” 2 “

కుల మతాలు అడ్డం కాదు స్మశానానికి ” 2 “

                             ”  నీ జీవితం “

 

పాపులకు చోటు లేదు పరలోకమునందు

అందుకే మార్పుచెందు

మరణానికి ముందు                   ” 2 “

యేసు రక్తమే నీ పాపనికి మందు ” 2 “

కడగబడినవారికే గొఱ్ఱెపిల్ల విందు ” 2 ”   

 

                               ” నీ జీవితం  “