ఇళ్లలోన పండుగంట కళ్ళలోన

ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట

ఎందుకో ఎందుకే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా

మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు

ఎందుకో ఎందుకే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా

అర్దరాత్రి కాలమందు వెన్నెలఆహా

ఆశ్చర్యకరుడంట వెన్నెలఆహా (2)

జన్మించినాడంట వెన్నెలా

ఈ అవనిలోనంట వెన్నెలా (2)           ||ఇళ్లలోన||

 

హాఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా (2)

యూదా దేశమందు వెన్నెలఆహా

బెత్లెహేము పురమునందు వెన్నెలఆహా (2)

రాజులకు రాజంట వెన్నెలా

ఆ రాజు యేసంట వెన్నెల (2)          ||ఇళ్లలోన||

 

ఆహతార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా (2)

ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెలఆహా

దర్శింప వచ్చినారు వెన్నెలఆహా (2)

బంగారు సాంబ్రాణి బోళం

తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2)   ||ఇళ్లలోన||

 

దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా (2)

పాపులైన మనకోసం వెన్నెలఆహా

ప్రాణాన్ని అర్పించి వెన్నెలఆహా (2)

పరలోకానికి మార్గం వెన్నెలా

ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2)   ||ఇళ్లలోన||

 

హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా (2)

యేసయ్యను నమ్ముకో వెన్నెలఆహా

పాపాలను ఒప్పుకో వెన్నెలఆహా (2)

క్రొత్తగా జన్మించు వెన్నెలా

 

రక్షణను పొందుకో వెన్నెలా (2)       ||ఇళ్లలోన||