ఇరుకులో విశాలత కలుగజేసి

ఇరుకులో విశాలత కలుగజేసి నావు – ఎన్నెన్నో మేళ్ళతో నన్నునింపినావు “2″ఎన్నతరమే ప్రేమా వర్ణింపతరమే నీప్రేమా “2″ “ఇరుకులో”

1. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు – పరిశుద్ధాత్మతో నన్నునింపినావు “2″నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా- నీ పనిలో మెండుగాఫలియింప చేసినావు”2″

2. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను – నీ సేవలో జీవింపచేసినావునన్నూ “2″బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే – పరమ కానానులో నన్ను చేర్చు నీధరికి “2″

 

3. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు – చెవికి వినబడవుఆశ్చర్యక్రియలు “2″నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా – శాశ్వత ప్రేమతోనన్ను దీవించితివి “2″