ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక

ఇదే నా కోరిక

నవ జీవన రాగమాలిక (2)          ||ఇదే నా కోరిక||

 

యేసు లాగ ఉండాలని

యేసుతోనే నడవాలని (2)

నిలవాలని గెలవాలని

యేసునందే ఆనందించాలని (2)   ||ఇదే నా కోరిక||

 

ఈ లోకంలో పరలోకము

నాలోనే నివసించాలని (2)

ఇంటా బయట యేసునాథునికే

కంటిపాపనై వెలిగిపోవాలని (2)     ||ఇదే నా కోరిక||

 

యాత్రను ముగించిన వేళ

ఆరోహనమై పోవాలని (2)

క్రీస్తు యేసుతో సింహాసనము

 

పైకెగసి కూర్చోవాలని (2)             ||ఇదే నా కోరిక||