ఇది దేవుని తుదిపిలుపు

ఇది దేవుని తుదిపిలుపు యేసుక్రీస్తే ఆపిలుపు

ఆపిలుపే సిలువస్వరం ఆస్వరమే పరిశుధ్దాత్మవరం

వింటే పరలోకము మనసుంటె నిత్యజీవము  ఇది

మొదటిరాకలొ వదకుతేబడే గొఱ్రెపిల్లగ

రుచిరి పాపమును బుజమున మోసిన త్యాగశీలిగ

రక్తప్రోక్షనకు పాపక్షమాపన పంచిపెట్టెను

పునరుద్దానుడై శాపవిమోచన ప్రసాదించెను  ఇది

రెండోరాకలొ గొఱ్రెపిల్లయే కొదమసింఘమై

రెండంచులతో తలతలలాడే ఖడ్గదారియై

రొమ్మున బంగరుదట్టి దరించిన రాజుక్రీస్తుయై

తండ్రిని చేరగమోసిన శిలువే సింహాసనమై

అగ్నినేత్రములతో అపరంజి పాధములతో

పరమాగ్నిజ్వాల బలతురంగ స్వరతరంగమై

కడవరిదినముల కడవరిక్షణముల కడబూరద్వని ప్రతిద్వనించగ

దిక్కుదిక్కున పంఛబూతములు మహావేండ్రముతొ దహించిపోగ

మెరుపు దాడిల ప్రభునిరాకడ చండప్రచండ మార్తాండ బింబమై

కండ అకండము రక్తఉగృడై గగనమండలము గుండెలుచీల్చుకొనీ

మేగారూడిగ ప్రభువే దిగిరాగ మృత్యుకుళ్లిపడి కల్లు తెరవగ

 

మృత్యుంజయుడై తీర్పుతీర్చునని కళ్లుతెరచుకో కన్నీళ్లతోమేలుకో –2