ఇది కోతకు సమయం

ఇది కోతకు సమయం

పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా (2)

పైరును చూచెదమా పంటను కోయుదమా (2) ||ఇది కోతకు||

 

కోతెంతో విస్తారమాయెనే

కోతకు పనివారు కొదువాయెనే (2)

ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు||

 

సంఘమా మౌనము దాల్చకుమా

కోసెడి పనిలోన పాల్గొందుమా (2)

యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు||

 

శ్రమలేని ఫలితంబు మీకీయగా

వలదనుచు వెనుదీసి వీడి పొదువా (2)

 

జీవార్ధ ఫలములను భుజియింతమా (2) ||ఇది కోతకు||