ఇదియే సమయంబు రండి

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి

ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి

 

పాపులనందరిని తన దాపున చేర్చుటకై

ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా

మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా         ||ఇక||

 

రాజుల రాజైన యేసు రానై యుండెనుగా

గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి

తరుణముండగానే మీరు తయ్యారవ్వండి            ||ఇక||

 

బుద్ది లేని కన్యకవలె మొద్దులుగానుంటే

సిద్దెలలో నూనె పోసి సిద్ధపడకపోతే

తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి          ||ఇక||

 

వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు

తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ

మిమ్మును ఎరుగను మీరెవరో పోమ్మనును          ||ఇక||

 

సందియ పడకండి మీరు సాకులు చెప్పకను

గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి

మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ           ||ఇక||

 

జాలము చేయకను మీరు హేళన చేయకను

కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ

 

తరుణముండగానే మీరు త్వరపడి రారండి           ||ఇక||