ఇదిగో నీ రాజు వచ్చుచుండె

ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సీయోను కుమారి

సంతోషించు – యెరుషలేం కుమారి ఉల్లసించు     ఇదిగో ॥

1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే

పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె               ఇదిగో ॥

2. రక్షణగల వాడుగ – అక్షయుండగు యేసుడు

ఇచ్చతోడ యెరుషలేం – వచ్చుచుండె             ఇదిగో ॥

3. సాత్వికుండు యీభువిన్ – అత్యంతమగు ప్రేమతో

నిత్యరాజు నరులకై – వచ్చుచుండె                   ఇదిగో ॥

4. దీనవరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు

ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె                   ఇదిగో ॥

5. ఇలను గాడిదనెక్కియే – బాలుర స్తోత్రములతో

బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె                  ఇదిగో ॥

6. దావీదు కుమారుడు – దేవుడు పాపులకు

జయగీతములతో –  వచ్చుచుండె                     ఇదిగో ॥

7. యేసుని ప్రేమించుచు – హోసన్న పాడెదము

 

యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయ              ఇదిగో ॥