ఇందుకేనా….. ఇందుకేనా

ఇందుకేనా….. ఇందుకేనా….. ఇందుకేనా…..

 యేసయ్య నిను రక్షించినది – ఇందుకేనా సిలువలో బలి అయినది

క్రీస్తుప్రేమ చూపలేని – క్రైస్తవులం ఎందుకో

యేసుప్రేమ చాటలేని – ఈ బ్రతుకులెందుకో

1.నిదురపోయే సింహాలవలే – బ్రతికే బ్రతుకులెందుకో

నశియించే ఆత్మలకై – పరుగు తీయవెందుకో”ఇందుకేనా”

2.విగ్రహాలనే దేవతలుగా – కొలిచే ఈ ప్రజలు

యేసంటే ఎవరో అని – అడిగే అమాయకులు

వారికి ప్రకటించే భారం – నీకు నాకు లేదా

వారిని ఓదార్చే బ్యాధ్యత – నీలో నాలో ఉన్నది”ఇందుకేనా”