ఇంత కాలం నీదు కృపలో

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)

ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)         ||ఇంత కాలం||

 

ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా (2)

మారని వీడని ప్రేమే నీదయ్యా

మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)         ||ఇంత కాలం||

 

నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం (2)

నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా

వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)           ||ఇంత కాలం||

 

దూరమైతిరి ఆప్తులు విడచిపోతిరి నా హితులు (2)

శోధన వేదన తీర్చిన యేసయ్యా

 

తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)           ||ఇంత కాలం||