అవునంటే కాదాని ఉన్నదాంటే లేదాని అబద్దాలతో కాలం గడిపేవా

అవునంటే కాదాని ఉన్నదాంటే లేదాని అబద్దాలతో కాలం గడిపేవా

రమ్మంటే రానని ఏమీ చెయ్యలేనని

సాకులతో తప్పించుకు తిరిగేవా

నీ బాధ్యతలను మరిచేవా – సోమరిగా బ్రతికేవా

1.            ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు

ఆ రోజే అన్ని పనులు చేయపూనుకుంటావు

దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు

దైవ కార్యాలను అశ్రద్ధా చేస్తావు

నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏంచేస్తావు

2.            దేవునికియ్యాలంటే చెయ్యి కురచ చేస్తావు

అర్పణ వేయ్యాలంటే చిల్లర వెదికి తీస్తావు

వర్థిల్లినకొలదీ ఇవ్వకుంటావు

పొందియు కృతజ్ఞత చూపకుంటాంవు

దీవించే దేవుడు కళ్ళెర్రజేస్తే ఏం చేస్తావు

3.            తోటివారికైనా సువార్త చెప్పకుంటావు

సాటివాడు ఏమైతే నాకేమనుకుంటావు

నా పనికాదంటూ తప్పుకుంటావు

ఏ తలాంతు లేదాంటూ వెనక ఉంటావు

 

యజమాని వచ్చి నిన్ను లెక్క అడిగితే ఏం చేస్తావు