అల్పుడనైన నాకొరకై నీ ఐశ్వర్యమునె విడచితివా

అల్పుడనైన నాకొరకై నీ ఐశ్వర్యమునె విడచితివా పాపినైన నాకొరకై నీ ప్రాణమునె అర్పించితివా ప్రాణమునె అర్పించితివా

1.            కెరూబులతో సెరాపులతో నిత్యము నిన్నె పొగడు చుండు పరిశుద్దుడు పరిశుద్దుడని ప్రతిగానములతో స్తుతియించె మహిమనే నీవు విడచితివా

 

2.            సుందరులలో అతి సుందరుడవు వేల్పులలోనే ఘనుడవు నీవు ఎండిన భూమిలో మొక్కవలే సొగసు సురూపము విడచితివా దాసుని రూపము దాల్చితివా