అరణ్య యాత్రలో సాగిపొదున్ నా ప్రభువు నాతోనుండున్

అరణ్య యాత్రలో సాగిపొదున్ నా ప్రభువు నాతోనుండున్

ఆయనే రక్షణ తోడు నీడ దినదినము నన్ను కృపతో   నింపున్ 

చేరుదున్ నేను కానానుకు చిరకాలమచ్చట నుందున్

1.            ఐగుప్తును విడచి పయనింతును పాప బంధాలను తెంచి రక్షణ నొందున్ సైతాను శరిరముతో నేను

 పోరడి జయమొంది శక్తనిలుతున్ (అరణ్య)

2.            అడ్డొచ్చినా ఎర్ర సంముద్రము నీళ్ళ బాప్తీస్మము ద్వారా అధిగమింతున్ దినదినము కురియు మన్నా భుజియించి

దైర్యముతో నా యాత్రను కొనసాగింతున్ (అరణ్య)

3.            చేదైన స్థలమైన మారనులో భీతి నిరాశ రోగములు కొరతలయందు

ప్రియ యేసు వాటిని మధురముగా మార్చి

తన జీవజలముతో తృప్తిపరచెన్(అరణ్య)

4.            మేఘమువలే ప్రభు నన్ను నడిపించును 

అగ్ని స్థంభముగా నాకుండి వెలుగించ్చును

 

భయపడను నేను నిరాశ చెందన్  నేత్రాలు కానానుపై నిలిపెదన్.(అరణ్య)