అమ్మా విశ్వాసమ్మా అణుకువ కలిగుండాలమ్మా

అమ్మా విశ్వాసమ్మా అణుకువ కలిగుండాలమ్మా

భక్తిగలస్త్రీలకు తగినట్టుగా

శక్తినాశ్రయించి బ్రతకాలమ్మా

1. నగలు నాణ్యాలపైన అత్యాశ వలదమ్మా

క్షయముకాని శాశ్వతధనము పైన నీకు కలదమ్మా

నీ వేష భాషలలో అనుకరణ చావాలమ్మా

నీతి వస్త్రధారణనే అలంకరణ కావాలమ్మా

2. తేనెలాంటి తీపిమాటలు వల్లించుట దేనికమ్మా

క్రియలు లేని గొప్పబోధలు ఉపయోగం లేనివమ్మా

అనురాగం ఆత్మీయతలే నీ సంపదలవ్వాలమ్మా

యేసు ప్రేమ ప్రతిరూపముగా ఇల నీవు నిలవాలమ్మా

3. మెడలోనే సిలువ ధరిస్తే నీకేమి లాభమమ్మా

జీవితాన సిలువను మోస్తే నిత్యమైన జీవమమ్మా

గుడిలోన దేవదూతలా కనిపిస్తే సరిపోదమ్మా

 

ప్రతిచోట క్రీస్తుదివ్వెలా వెలుగిస్తే సిరి నీదమ్మా