అబ్బా తండ్రి అని ప్రార్థించెదము

అబ్బా తండ్రి అని ప్రార్థించెదము

విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము.

1.            విశ్వాస ప్రార్ధన రోగిని స్వస్థపరుచును

ఏకాంత ప్రార్ధన ఆత్మను బలపరుచును

కన్నీటి ప్రార్ధన కనికరము పుట్టించును. || అబ్బా||

2.            ఉపవాస ప్రార్ధన ఉజ్జీవం కల్గించును

సహవాస ప్రార్ధన చెర నుండి విడిపించును

ఆత్మలో ప్రార్ధన అభిషేకం నింపును. || అబ్బా||

3.            కనిపెట్టు ప్రార్ధన దర్శనము కల్గించును

విజ్ఞాపనా ప్రార్ధన ఆత్మలను కాపాడును

 

ఆసక్తితో ప్రార్ధన అద్భుతములు జరిగించును. || అబ్బా||