అబ్బా అని పిలిచే అధికారమిచ్చినావు

అబ్బా అని పిలిచే అధికారమిచ్చినావు

నాన్నా అని అడిగే అవకాశమిచ్చినావు(2)

అల్పుడనూ నా కొరకు ప్రాణమిచ్చినావు(2)

నీ ఒడిలో తలదాల్చే భాగ్యమిచ్చినావు(2)

1.పలుమార్లు నీకు నేను దూరమైతినయ్యా

అయినా నీ ప్రేమ చేత పలకరించినావయ్యా(2)

కమ్మని కౌగిలిలో సేదతీర్చినావు(2)

కంటి పాపలా నను కాయుచున్నవాడవు(2)”అబ్బా”

2.నీవే నా కోట నే పాడుకునే పాట

నేవే నా జీవం నమ్మదగిన దైవం(2)

ఆపదలో ఆదుకునే నిజమైన హితుడా(2)

 

నీవు లేనిదే నా బ్రతుకు లేదు(2)”అబ్బా”