అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే

ఆరాధింతును నిన్నే

ఆహాహా.. హల్లెలూయా ఆహాహా.. హల్లెలూయా ||3||

ఆహాహా.. హల్లెలూయా ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి

సమాధాన అధిపతి స్తోత్రం            ||ఆహాహా||

1.            కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం                    ||ఆహాహా||

2.            స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం

మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం     ||ఆహాహా||

3.            మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం

మమ్మును కొనిపోవ త్వరలో రానున్నమేఘ వాహనుడా స్తోత్రం  ||ఆహాహా||

4.            ఆమెన్ అనువాడా స్తోత్ర అల్ఫా ఒమేగా స్తోత్రం

 

అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం                 ||ఆహాహా||