అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా

అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా

ఆర్భాటముతో బూరధ్వనితో

మహా మహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను

1.            ఈ లోక కార్యాలందు ఎంత కాలం సంతసిస్తావు

ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా

ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పంచుము

2.            దేవుని ఉగ్రత త్వరలో రానైయున్నది

కాల్చివేయును అంధకార సంబంధులను

నీతిమంతులు పరలోకం స్వతంత్రించుకొందురు

3.            నిత్య జీవము కలిగి ఆనందింతురు

ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు

 

ఈ జీవితాంతము వరకు యేసుకై నిలిచెదము