అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును

అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును

అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును

నా ప్రేమమూర్తి యేసు నీవుండగా  నేనింక వేరేమి కోరుకొందును

1.            నా కోసమే ఆ సిలువలో – ఎన్నెన్ని బాధలు అనుభవించినావు

మరణంబునొందునంతగా – నీ ప్రేమ చూపినావుగా

2.            ఇహలోకపు మమతలన్నియు-నీ ప్రేమ ముందు బహుస్వల్పమే

ఇలలోని సంపదాలన్నియు – నీ ఎదుట చూడ అల్పమే

3.            ఇల నన్ను కన్నతల్లికన్ననూ – విలువైన ప్రేమ చూపించితివే

 

వెలలేని మంచిమిత్రుడా – బలమైన నా దేవుడా