అడుగుడి మీకు ఇవ్వబడును

అడుగుడి మీకు ఇవ్వబడును

వెదకుడి మీకు దొరుకును (2)

తట్టుడి మీకు తీయబడును (2)

అని యేసుడు మీతో చెప్పుచుండగా

అడగక వెదకక తట్టక తిరుగుచుందురా

తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా         ||అడుగుడి||

 

అడగమని నా యేసు మీకు చెప్పగా

అడగక ఈ ఆగడాలు దేనికి (2)

ఈ క్షణమే యేసయ్యను చేరుకో

అడిగి నీ దీవెనలు పొందుకో

పొందుకో దీవెనలు పొందుకో          ||అడుగుడి||

 

వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా

వెదకక ఈ వాదులాట దేనికి (2)

వెంటనే యేసయ్యను వేడుకో

పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును

దొరుకును నీ ఫలములన్ని దొరుకును        ||అడుగుడి||

 

తట్టమని నా తండ్రి మీకు చెప్పగా

తట్టక ఈ తడవులాట దేనికి (2)

తక్షణమే తండ్రి తట్టు తిరుగుము

తెరువబడిన మార్గములో సాగుము

 

సాగుము మార్గములో సాగుము           ||అడుగుడి||