అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా

అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా

ప్రతిగా ఏమివ్వగలనయ్యా నిను స్తుతియించే హృదయము తప్ప

నా జీవితం నీకే అంకితమయ్యా            ||అడిగినది||

1.            ఊహించలేని వివరింపజాలనినీ కార్యములు ఆశ్చర్యమే

యోచించినా నా వర్ణనకందని నీ కృపా కనికరములు అత్యున్నతమే “2”

తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా

యుగయుగములకు నీకే ఘనతా మహిమా

సతతం నిను నే కొనియాడెదను

సకలం నీ నామముకే స్తోత్రము తగును            ||అడిగినది||

2.            క్షణ భంగురం నా క్షయ జీవితం

కాచావయ్యా నను నీ రెక్కల నీడ

ఏ యోగ్యత లేని అల్పుడను నన్ను

హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ “2”

నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య

నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య

నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా

ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా                 ||అడిగినది||

3.            మహిమోన్నతుడా నను మరువని విభుడా

ప్రణుతించెదను నిన్నే నిరతం

నిష్కలంకుడా నిర్మలాత్ముడా

ఫ్రచురించెదను నీ పావన చరితం “2”

నా అతిశయము నీవే నా యేసయ్యా

నా ఆధారము నీవే నా మెస్సయ్యా

నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా

 

ఈ దీనుని సేవను చేకొనుమయ్యా          ||అడిగినది||