అడగకముందే అక్కరలనెరిగి

అడగకముందే అక్కరలనెరిగి – అవసరాలు తీర్చిన ఆత్మీయుడా…

ఎందరువున్న బంధువు నీవై బంధాలను పెంచినా భాగ్యవంతుడా…

పల్లవి: పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నాపాటగా

మరీ మరీ నేను చాటుకోన మనసంత పులకింత నీ సాక్షిగా

నా జీవిత గమనానికి గ మ్యము నీవే

చితికిన నా గుండెకు రాగము నీవే  – 2 ||పదే||

మమతల మహారాజ యేసు రాజా  – 3  

1.            అడగ ముందే అక్కరలనెరిగి – అవసరాలను తీర్చిన ఆత్మీయుడా

ఎందరు ఉన్న బంధువు నీవై – బంధాలను పెంచిన భాగ్యవంతుడా

అవసరాలు తీర్చిన ఆత్మీయుడా…

బంధాలను పెంచిన భాగ్యవంతుడా…

మమతల మహారాజ యేసు రాజా  – 3

2.            అలిగినవేళా అక్కునచేరి అనురాగము పంచిన అమ్మవు నీవే

నలిగిన వేళా నాధరి చేరి  నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే

అనురాగము పంచిన అమ్మవు నీవే

 

నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే     ||పదే||