అగ్ని మండించు నాలో అగ్ని మండించు

అగ్ని మండించు నాలో అగ్ని మండించు –2

పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు –2

1.            అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా

ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (అగ్ని)

2.            అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను

ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (అగ్ని)

3.            అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే

నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే

4.            ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా(అగ్ని)

 

నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా