అంబరవీధిలో తారక – వెలసెను

అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా

యూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా

1.            జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించి

శిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి

2.            అంధకారమును తొలగించి – హృదయపు దీపము వెలిగించి

వాక్యమే ఇల నిజతారకలా నడుపును మార్గము బొదించి

3.            జగతికి యేసుని చూపించి జనులకు రక్షణ చాటించి

 

ప్రతి క్రైస్తవుడు ఒక తారకలా నిలవాలి వెలుగును పంచి