ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2)||ఆహా||
1. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా||
2. అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా||
3. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||