ఆశైతే ఉంది నాలో అందుకొలేకున్నాను
నా చేయి పట్టుకో నా రక్షకా (నా యేసయ్యా)
1. నీలోనే నేను నిలవాలని – నీ ఆత్మలో నేను నడవాలని
నీ రూపునే పొందుకోవాలని – నీ మనసు నాకిలరావాలని “ఆశైతే”
2. నీ ప్రేమనే కలిగి యుండాలని – నీ ఫలము నాలో పండాలని
నీ కృపతో నా మది నిండాలని – ఆత్మాగ్ని నాలో మండాలని “ఆశైతే”
3. ఆనాటి పౌలులా బ్రతకాలనీ – ఆశ్చర్య కార్యాలు వెదకాలని
ఆత్మీయ శిఖరాల నెక్కాలని – అపవాదిని చితుక త్రొక్కాలని”ఆశైతే”