ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినంBy jesusongs / ఆ ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది 1. ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే –2 జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో –2॥ఆశ్చర్య॥ 2. ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే –2 పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే –2 ॥ఆశ్చర్య॥ 3. యేసయ్యా – నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను –2 నీ కృపను గూర్చి పాడెదను – ఆత్మానందముతో 2 ॥ ఆశ్చర్య ॥