ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ॥2॥
అను.ప:- ఎంత ధన్యమో యేసుని వెదకుట ఎంత ధన్యమో
ఎంత భాగ్యమో యేసుని నమ్ముట ఎంత భాగ్యమో ॥2॥
1. దుప్పి నీటికై ఆశపడునట్లుగ
దేవుని కొరకై ఆశపడుచున్నాను ॥2॥
దేవుని సన్నాధిని నిత్యముండునట్లుగా …. ॥2॥
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ॥ఎంత ధన్యమో॥ ॥ఆశతీర॥
2. లోక ఆశలూ లయమై పోవును
లోకులెవ్వరూ కాపాడలేరు ॥2॥
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం… ॥2॥
లోబడు వారిని పరమున చేర్చును ॥ఎంత ధన్యమో॥ ॥ఆశతీర॥