ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ “2″ చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము – స్తోత్రము స్తుతి స్తోత్రము
(2)
1. దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులుకీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో నివసించు దేవా(2)
నాస్తుతి గీతము నీకే ప్రభువా
స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
2. సిలువలో మాకై మరణించినా – పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) – యుగ,యుగములు నీకే మహిమ(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)