ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||
1. ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||
2. అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగురుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2) ||ఆనందమే||