ఆనందించండి యేసుక్రీస్తునందు
స్తుతి చెల్లించండి అన్నివేళలందు
ఇక చింత దేనికండి – ప్రభు చెంతనుండెనండి
1. యేసు కలిగిన దీనమనస్సు మీరూ కలిగియుండుడి
ఒకరికంటె మరియొకడు యోగ్యునిగా ఎంచుకొనుడి
స్వంత కార్యములే గాక ఇతరులకు సహాయపడుడి
కక్షలు అసూయలేక సహవాసములో సాగుడి
2. దైవపిలుపునకు కలుగు బహుమానం కొరకు చూడుడి
వెనుక ఉన్నవన్నీ మరచి గురియొద్దకే పరుగెత్తుడి
మూర్ఖలైన జనులమధ్యా జీవవాక్యము చేతబట్టుడి
అంథాకార లోకమునందు జ్యోతులవలె వెలుగీయుడి