ఆధారమైన నీవే ఆశ్రయమైన నీవే ఆనందమైన నీవే నాకు అన్ని నీవే నాకున్న తోడు నీవే నాకున్న నీడ నీవే
1. కన్నీటి లోయలలో నే కృగిన వేళలలో నాశ్రమ వేదనలో నా తోడై యున్నావు ఆదరించావు నన్నాదుకున్నావు ధైర్యమిచ్చావు నను బలపరచవు
2. మహిమ గల పరిచర్యకై నీవు నన్ను పిలిచావయ్యా నీ సేవ చేయుటకై నీ ప్రేమను చాటుటకై అభిషేకించావు నను వాడుకున్నావు నీ పాత్రగా నన్నీలలో మలుచుకున్నావు