ఆ కలవరి మార్గములో-యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓసోదరా-నెమ్మది నివ్వను ఓ సోదరి(2)
1గరుకు రాళ్ల మార్గములో -బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి- దేహమంతా చీలెను(2)
2 మేకులు కొట్టిరి కాళ్ళకు-తలకు ముండ్ల కిరీటం
యేసు రక్తం నదివలే సిలువపై నుండి ప్రవహించే
3 గాయపడిన చేతులు చాచి-ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను-నిత్య జీవము నివ్వను
4 పాపంలోనే ఉందువా పాపం వలన మరణము
నీ పాపములను ఒప్పుకో-కడుగును యేసు రక్తము
5 హృదయ తలుపు తట్టుచున్నాడు-తెరువుము నీ హృదయం
చేర్చు కొనుము యేసుని -శాంతి నీకు దొరుకును