ఆ జాలి ప్రేమను గమనింపకుందువా?

ఆ జాలి ప్రేమను గమనింపకుందువా?

ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా?

ఓ సోదరా. . . ఓ సోదరా . . . ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా?

1.            నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే

ఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెను

నీ శిక్ష బాపగా రక్షణను చూపగా

ని హృదయ ద్వారమందు వేచియుండెగా

నీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెను

ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా?

2.            ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనె

యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు

నీ పాప జీవితం ప్రభుయేసు మార్చగా

నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను

విలువైన రక్త ధార ప్రేమతోడ గార్చెను

 

ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా?