ఆ కలవరి మార్గములో-యేసు సిలువను

ఆ కలవరి మార్గములో-యేసు సిలువను మోసెను

రక్షణ నివ్వను ఓసోదరా-నెమ్మది నివ్వను ఓ సోదరి(2)

1గరుకు రాళ్ల మార్గములో -బరువు సిలువను మోసెను (2)

కొరడాలతో కొట్టిరి- దేహమంతా చీలెను(2)

2 మేకులు కొట్టిరి కాళ్ళకు-తలకు ముండ్ల కిరీటం

యేసు రక్తం నదివలే సిలువపై నుండి ప్రవహించే

3 గాయపడిన చేతులు చాచి-ప్రభువు పిలచుచుండెను

పాపపు స్థితిని మార్చను-నిత్య జీవము నివ్వను

4 పాపంలోనే ఉందువా పాపం వలన మరణము

నీ పాపములను ఒప్పుకో-కడుగును యేసు  రక్తము

5 హృదయ తలుపు తట్టుచున్నాడు-తెరువుము నీ హృదయం

 

చేర్చు కొనుము యేసుని -శాంతి నీకు దొరుకును