ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప

ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2)

ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2)||ఆహా||

1.            ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2)

వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా||

2.            అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2)

రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా||

3.            తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2)

ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2)        ||ఆహా||