ఆహా మహానందమే – ఇహ పరంబులన్

ఆహా మహానందమే – ఇహ పరంబులన్

మహావతారుండౌ – మా యేసు జన్మ దినం –

హల్లేలూయ .. ఆహా ..

1.            కన్యక గర్భమందు పుట్టగా – ధన్యుడవంచు

దూతలందరు (2)

మాన్యులౌ పేద గొల్లలెందరో – అన్యులౌ తూర్పు

జ్ఞానులెందురో (2)

నిన్నారాధించిరి – హల్లేలూయ .. ఆహా ..

2.            యెహోవా తనయా – యేసు ప్రభూ సహాయుడా – మా

స్నేహితుడా (2)

ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ –

మహానందముతో నిన్నారాధింతుము(2)

నిన్నారాధింతుము – హల్లేలూయ .. ఆహా ..

3.            సర్వేశ్వరున్ రెండవ రాకడన్ – స్వర్గంబు నుండి వచ్చు

వేళలో (2)

సర్వామికా సంఘంబు భక్తితో – సంధించి నిన్ స్తోత్రిం

చు వేళలో (2)

నిన్నారాధింతుము – హల్లేలూయ .. ఆహా ..