ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా!

ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా! విమోచక=ద్రోహ

రహిత చంపె నిను నా-దోషమే గదా [యాహా]

1.            “వీరలను క్షమించు తండ్రి-నేర రేమియున్”= కోరి

తిటులు నిన్ను జంపు-క్రూరజనులకై [యాహా]

2.            “నీవు నాతో బరదైసున-నెదె యుందువు”=పావనుండ

యిట్లు బలికి-పాపి గాచితి [యాహా]

3.            “అమ్మా!నీ సుతుడ” టంచు మరి-యమ్మతో బలికి=

క్రమ్మర “నీ జనని”యంచు-గర్త నుదివితి [యాహా]

4.            “నా దేవ దేవ యేమి విడ-నాడితి”వనుచు=శ్రీ దేవసుత

పలికితివి శ్రమ-చెప్ప శక్యమా [యాహా]

5.            “దప్పిగొనుచున్నా”నటంచు-జెప్పితివిగదా=యిప్పగి

దిని బాధనొంద-నేమి నీకు హా! [యాహా]

6.            “శ్రమ ప్రమాదములను గొప్ప శ్బ్దమెత్తి హా=సమ్మప్త

మైన” దంచు దెలిపి-సమసితివి గదా [యాహా]

7.            “అప్పగింతు దండ్రి నీకు-నాత్మ”నంచును=గొప్ప

యార్భాటంబు చేసి-కూలిపోతివా [యాహా]