ఆహా ఆహాహా మహదానందామే

ఆహా ఆహాహా మహదానందామే

యెహోవా సుకార్యంబులాశ్చర్యమే

మహాఘనుడును మహోన్నతుడును

మహోపకారి యేసు కృపలు తలువను

1.            మహాసంద్రమే అడ్డుగా నిల్చినా

మహా సమూహములు మోహరించినా

మహా కడలిలో బాట వేయును

హాహాకారమును పాటగ మార్చును

2.            మహారణ్యములో యాత్ర చేసినా

అహోరాత్రులు తోడుగా నడచును

అహర్నిశలు కింటిపాపలా కాచును

సహాయమైయుండి దారికి చేర్చును