ఆశ్రయింప నా యేసున్నాడు

ఆశ్రయింప నా యేసున్నాడు

శాశ్వతకాలం క్రీస్తు మారనివాడు

నిరీక్షణ కాధారం లేని వేళలో

నమ్మకమైన దుర్గమే

చరణములు

1.సైన్యాధిపతి యెహోవా

యాకోబు యొక్క ఆశ్రయం

ఆపత్కాలమునందు నాకు ప్రభువే

నిజమైన సహాయకుడు – ఆశ్రయింప

2.పునాదులు పాడైయుండగా

నీతిమంతుడేం చేయును

క్రీస్తనే బండయే నాకు ఆశ్రయం

కదల్చబడను ఎన్నడు – ఆశ్రయింప

౩.నిరీక్షణ లేని కాలంలో

అబ్రహాం దేవుని నమ్మెను

విశ్వాస మార్గమందు నాశ్రమలలో

మహిమ నిరీక్షణ క్రీస్తే – ఆశ్రయింప

4.మనుష్యులన్ నమ్ముటకంటే

యెహోవాను నమ్ముటే మేలు

శోదన పోరాటములో నాదు గురి

రక్షకుడేసు మాత్రమే – ఆశ్రయింప

5.సీయోను షాలేం నగరం

నిత్య నివాస స్థలము

ఆశ్రయ పురమును చేరి ప్రభుతో

సదాకాలం హర్షించెదను – ఆశ్రయింప