ఆశ్రయదుర్గమా…. నా యేసయ్యా….

ఆశ్రయదుర్గమా…. నా యేసయ్యా….

నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా…

ఊహించలేనే నీ కృపలేని క్షణమును

కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే

ఆశ్రయదుర్గమా…. నా యేసయ్యా

1.            లోక మర్యాధలు – మమకారాలు -గతించి పోవునే

ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే… (2)

అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి…..2 “ఆశ్రయ”

2.            నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెర వేర్చు చుంటినే

నీతో చేసిన.. తీర్మానములు స్థిరపరచితివే…(2)

అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి…..2 “ఆశ్రయ”

3.            పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను

నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద…(2)

అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి…..2 “ఆశ్రయ”

4.            నిత్య నివాసినై నీముఖము చూచుచు పరవశించెదనే

ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించు చున్నది (2)

స్తుతి,ఘనమహిమలు నీకే చెల్లును నా యేసయ్యా

హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా…. 2 “ఆశ్రయ”