ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)

అద్భుతములతో నిన్ను నడుపును ప్రార్థించుమా నిత్యము

నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య||

 

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా

యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను

జాలరుల మదిలో ఆనందమే

యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)

హోసన్నా జయము నీకే రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||

 

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం

యేసు మాట నిలుచును తరతరాలు

తండ్రిలా పోషించి దీవించును

తల్లిలా ఆదరించి ప్రేమించును (2)

 

హోసన్నా జయము నీకే రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||