ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది

నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||

1.            పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||ఆశ్చర్యమైన||

2.            పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ

నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే.    ||ఆశ్చర్యమైన||

3.            శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చినప్రేమ

విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||

4.            నా స్థితి జూచిన ప్రేమ నాపై జాలిని జూపిన ప్రేమ

 

నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||