ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)

తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో

తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2)     ||ఆశ్చర్యకరుడు||

1.            తన చేతిలో రోగాలు లయమైపోయెను

తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)

తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)

నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)      ||ఆశ్చర్యకరుడు||

2.            మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు

మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)

తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)

తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)    ||ఆశ్చర్యకరుడు||