ఆశ్చర్యకరుడా మా పాలి విభుడా

ఆశ్చర్యకరుడా మా పాలి విభుడా

యుగయుగములకు స్తోత్రార్హుడా

శిశువుగ మారిన నజరేయుడా

మనిషి రూపున మహనీయుడా

1. బలహీనతలో బలపరచను బలవంతుడుగా దిగివచ్చినావు

పరలోక జ్ఞానము దయచేయను ఆలోచనకర్తగా వచ్చినావు

2. అక్షయతను అనుగ్రహించను నిత్యదేవుడుగా దిగివచ్చినావు

తండ్రితో వైరము తొలగించను సమాధాన అధిపతిగా వచ్చినావు